ఈనెల 6న కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు!

-

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. నిన్న తెలంగాణ మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది.

thellam venkatrao into congress on 6th april

ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం లో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఇల్లెందులో సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారట. ఈ నెల 6న తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news