జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ బీసీబంధు అంటున్నారు – VH

-

నేడు గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీ కులగణన గురించి బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ.. బీసీ బంధు అంటున్నారని విమర్శించారు.

బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వీ.హెచ్. ఉత్సవాల పేరుతో పార్టీ ప్రయోజనం కోసం డబ్బులను ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. బిజెపి మైనారిటీ రిజర్వేషన్లు ఎత్తేస్తామంటే కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ.. కనీసం కేంద్రంలో బీసీ శాఖను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news