ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది సిఈసి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనవరి 16 న ముగియనున్న అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. గతంలో డిసెంబర్ 7 2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
మధ్య ప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 6 జనవరి తో మధ్యప్రదేశ్ అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. గతంలో నవంబర్ 28, 2018 న ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్ లో అసెంబ్లీ 200 స్థానాలు ఉన్నాయి. గతంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి డిసెంబర్ 7 , 2018 న ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్ అసెంబ్లీకి 14 జనవరి తో ముగియనుంది అసెంబ్లీ పదవి కాలం. అటు ఛత్తీస్ ఘడ్ లో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.