భద్రాచలం వద్ద మూడో హెచ్చరిక జారీ

-

వారం రోజులుగు కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమైపోయింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుండపోత వర్షాలతో వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఓవైపు రాష్ట్రంలో కురిసిన వర్షాలు.. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలోకి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు.

ఇదే చివరి ప్రమాద హెచ్చరికగా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నీటిమట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్​ ప్రియాంక పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద ఉద్ధృతికి తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన రహదారిపైకి నీరు వచ్చింది. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news