తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే… కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలతో తెలంగాణలో రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది తెలంగాణ విద్యాశాఖ. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రానికి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. దీంతో నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.