తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇవాళ, రేపు సెలవులు రద్దు

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సంస్థ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు TSNPDCL సిఎండి గోపాల్ రావు పర్యటించారు. ఉద్యోగులు నేడు, రేపు విడుదల హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. వరద ముప్పు నేపథ్యంలో అధికారులు, ఉద్యోగులు, ఆర్జిజెన్లు తప్పనిసరిగా డ్యూటీకి రావాలని స్పష్టం చేశారు.

ఈ ఆదేశాలను విస్మరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు ఆరోగ్య సిబ్బంది సెలవులను సైతం రద్దు చేశారు.కాగా, తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు క్షేత్రస్థాయి పరిస్థితుల పై ఆరా తీశారు.

శుక్రవారం వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాల పై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news