మాంసప్రియులకు షాక్..భారీగా పెరిగిన చికెన్ ధరలు

-

Chicken prices : మాంసం తినేవారికి బిగ్‌ షాక్‌. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాదులో నిన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ ధర రూ. 180-200 మధ్య ఉండగా… ఇవాళ రూ. 200-220కు చేరింది.

Chicken prices increased by Rs.50 per kg
Chicken prices increased by Rs.50 per kg

కొన్ని చోట్ల కేజీ రూ. 230 చొప్పున కూడా అమ్ముతున్నారు. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న రూ. 160-180 మధ్య ఉన్న ధర ఇవాళ రూ. 200 పలుకుతోంది. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో రూ. 200-230 మధ్య చికెన్ ధర ఉంది.

ప్రస్తుతం సంక్రాంతి పండుగ, పెళ్లిళ్లు మరియు ఫంక్షన్ సీజన్ కావడంతో చికెన్ రేట్లు భారీగా పెరిగాయని చెబుతున్నారు వ్యాపారస్థులు. అయితే..సంక్రాంతి పండుగ కావడంతో… సామాన్య ప్రజలు కూడా చికెన్ వైపే మొగ్గు చూపుతుండడం కూడా ఒక కారణం అని అంటున్నారు.. చికెన్ రేట్లు పెరగడంతో నాన్ వెజ్ ఎక్కువ తినేవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news