HYD : చిక్కడపల్లిలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య

-

HYD : చిక్కడపల్లిలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆ యువతి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానాస్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలు వరంగల్ జిల్లా చెందిన ప్రవల్లికగా గుర్తించారు పోలీసులు. ఇక సమాచారం అందుకున్న తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు క్లూస్ టీం.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుంది. అయితే.. ఈ సంఘటన జరిగిన అశోక్ నగర్ లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వేల సంఖ్యలో ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కింద ఆందోళన చేస్తున్నారు యువకులు. పదేళ్లుగా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించలేదని ఆందోళన చేస్తున్నారు యువకులు.గ్రూప్స్ పరీక్షలు వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆందోళన దిగారు యువకులు. కాగా, ప్రవల్లిక ఆత్మహత్యకు గాల కారణాలను సేకరిస్తున్నారు చిక్కడపల్లి పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news