తెలంగాణ రాష్ట్ర వాహనదారులకు బిగ్ అలర్ట్. ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్ కు నేడే ఆఖరి రోజు కానుంది. నేటితో తెలంగాణ రాష్ట్రంలో డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది. దీంతో రేపటి నుండి యధావిధిగా చలాన్ రుసుము వసూలు చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు. మార్చ్ 1 నుండి డిస్కౌంట్ ఆఫర్ ను ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
ఈ ఆఫర్ పై భారీ స్పందన రావడంతో… ఏప్రిల్ 15 వరకు పొడగించారు పోలీసులు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం వాహనదారులు చలాన్ లు క్లియర్ చేసుకున్నారు. ఈ డిస్కౌంట్ కారణంగా.. 250 కోట్లు రూపాయలను ఫైన్ రూపంలో చెల్లించారు వాహనదారులు.
అయితే… మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదు అని స్పష్టం చేశారు పోలీసులు. దీంతో ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్ కు నేడే ఆఖరి రోజు కానుంది. కాబట్టి… తెలంగాణ రాష్ట్రంలోని.. వాహనదారులంతా…. ఇవాళే.. ట్రాఫిక్ చలాన్ల ను క్లియర్ చేసుకోవాలని… లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.