గుడ్​న్యూస్.. దిగొచ్చిన టమాట.. కిలో ధర రూ.25

-

వినియోగదారులకు గుడ్ న్యూస్. గత రెండు మూడు నెలల నుంచి కొండెక్కిన టమాట ధర ఎట్టకేలకు దిగొచ్చింది. ఇన్ని రోజులూ కిలో టమాట ధర దాదాపు రూ.150 నుంచి రూ.300 పలికింది. తాజాగా ధర దిగిరావడంతో ఇప్పుడు సాధారణ రేటుకే లభిస్తోంది. ప్రస్తుతం చాలా చోట్ల కిలో టమాట ధర రూ.25 నుంచి రూ.30 వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాట రావడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెబున్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌ నుంచి కూడా టమాటా అధికంగా వస్తుంది. తాజాగా ఏపీలోని మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం మార్కెట్‌కు దాదాపు 400 టన్నుల టమాటా రావడంతో ధర మరింత పడిపోయింది. మొదటి రకం టమాటా కిలో రూ.30 నుంచి రూ.40 పలికింది. రెండో రకం టమాటా కిలో రూ.21 నుంచి రూ.28 వరకు పలికింది.

Read more RELATED
Recommended to you

Latest news