పెండింగ్ చలాన్ల క్లియ రెన్స్ కు పోలీస్ శాఖ ఇచ్చిన డిస్కౌంట్ ను తెలంగాణ రాష్ట్ర వాహన దారులు సద్వి నియోగం చేసుకుంటున్నారు. కేవలం 22 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1.5 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ కాగా.. వాటి నుంచి రూ. 112.98 కోట్ల జరిమానా వసూలైంది. డిస్కౌంట్ కు గడువు మరో 09 రోజు లే ఉన్నది.
గడువులోగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలని వారు మార్చి 31 తర్వాత మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి వాహనాలపై పెండింగ్ చలాన్లు తనిఖీ చేసి.. చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. చలాన్లను క్లియర్ చేయనివారు ఆన్ లైన్, మీ-సేవ, ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద చెల్లింపులు చేయొచ్చు.
ఈ – చలాన్ల కు సంబంధించిన వెబ్ సైల్ https:// echallan.tspolice.gov.in లింక్ ద్వారా కూడా రాయితీతో జరిమానా కట్టుకోవచ్చును. ఈ అవకాశాన్ని వాడుకోకకపోతే.. మార్చి తర్వాత వాహనదారులపై కేసులు పెడతామని కూడా పోలీసులు చెబుతున్నారు.