న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్‌ మహానగరం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఇప్పటికే పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ (ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. జనవరి 1న రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు (పీఎన్‌ఆర్‌ మార్గ్‌), అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని వెల్లడించారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన మార్గాలు ఇవే

ఖైరతాబాద్‌ వి.వి.విగ్రహం కూడలి నుంచి ఫ్లైఓవర్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు, ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ మీదుగా వి.వి.విగ్రహం, నిరంకారి, రాజ్‌భవన్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.

హిమాయత్‌నగర్‌, లిబర్టీ నుంచి వచ్చే వాహనాల రాకపోకలు ఎగువ ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతించరు. ప్రయాణికులు తెలుగుతల్లి, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎడమ వైపు వెళ్లాలి.

బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ జంక్షన్‌ వద్ద ఇక్బాల్‌ మీనార్‌, లక్డీకాపూల్‌, అయోధ్య జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద సెన్షెషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ లేన్‌, లక్డీకాపూల్‌ వైపు మళ్లిస్తారు.

సికింద్రాబాద్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ సెయిలింగ్‌ క్లబ్‌ వద్ద కవాడిగూడ కూడలి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ దేవాలయం, లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని అశోక్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news