హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్లో నేడు ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు ట్యాంక్ బండ్పై వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలను అనుమతించమని అధికారులు తెలిపారు.

ట్యాంక్బండ్, కట్టమైసమ్మ, ఓల్డ్ అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, లిబర్టీ, ఇక్బాల్ మినార్, ఇందిరాగాంధీ రోటరీ, వీవీ విగ్రహం, కర్బలా, ఓల్డ్ సైఫాబాద్, రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయిని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు లోయర్ ట్యాంక్ బండ్ నుంచే వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్, రవీంద్ర భారతి, ఎన్టీఆర్ మార్గ్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు గన్ పార్క్ వైపు రాకపోకలు అనుమతించబోమని పోలీసులు తెలిపారు. బేగంపేట వైపు నుంచి సికింద్రాబాద్కు వచ్చే వాహనాలను సీటీఓ, తివోలీ, వైఎంసీఏ, సంగీత్‌ క్రాస్‌రోడ్స్‌ వైపునకు మళ్లించారు. బేగంపేట నుంచి కార్ఖానా వైపునకు వెళ్లే వాహనాలను పాట్నీ, వైఎంసీఏ వైపునకు మళ్లించి .. ఆర్‌పీ రోడ్‌ వైపు నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ, క్లాక్‌ టవర్‌, వైఎంసీఏ వైపు దారికి అనుమతి ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news