విషాదంః పిడుగుపాటుకు దంప‌తుల మృతి

చెడ‌గొట్టు వాన‌లు రైతుల‌ను నిండా ముంచుతున్నాయి. క‌రెక్టు గా కోత‌లు జ‌రుగుతున్న టైమ్ లో వ‌ర్షాలు ప‌డ‌టంతో.. వ‌రి రైతులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు పంట‌న‌ష్టం మాత్ర‌మే జ‌ర‌గ్గా.. నిన్న కురిసిన వాన‌లో ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఇక సంగారెడ్డి జిల్లాలో వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టించాయి. వ‌రిపంట‌లు నిండా మునిగాయి. ఎక్క‌డిక‌క్క‌డ క‌ళ్లాల్లో ఉన్న వ‌డ్లు త‌డిసిపోయాయి. అటు కొనుగోలు కేంద్రాల్లో సైతం ధాన్యం రాశులు త‌డిసిముద్ద‌య్యాయి. లోడ్ చేసిన సంచులు కూడా త‌డిసిపోయాయి. ఇక జిల్లాలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న తీవ్రంగా క‌లిచివేస్తోంది.

మనూరు మండలం మనూరు తండాకు చెందిన కిషన్ నాయక్ (40), భార్య కోమిని బాయి(35) నిన్న చేనులో ప‌నులు చేయ‌డానికి వెళ్లారు. వ‌డ్ల‌పై టార్ఫాలిన్ క‌వ‌ర్లు క‌ప్పుతుండ‌గా ఒక్క‌సారిగా వారిపై పిడుగు ప‌డ‌టంతో అక్క‌డిక‌క్క‌డే కుప్ప కూలారు. ఇద్ద‌రూ మృతి చెందారు. దీంతో తండాలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. వీరికి ముగ్గురు సంతానం