గోదావరి ఎక్స్​ప్రెస్ ఘటనతో పలు రైళ్లు రద్దు

-

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్​ప్రెస్​ బీనగర్‌-ఘట్‌కేసర్‌ మధ్య పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు రైళ్లు పూర్తిగా.. మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. రద్దయిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ప్రకటించారు.

ఇవాళ ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా బీబీనగర్‌ సమీపంలోని అంకుషాపూర్‌ వద్ద పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు ట్రాక్‌ నుంచి పక్కకు జరిగాయి. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్‌ మరమ్మతుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. మరోవైపు పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను అదే రైలులో తమ గమ్యస్థానాలకు చేర్చారు.

రద్దయిన రైళ్ల వివరాలివే.. కాచిగూడ-నడికుడి (07791), నడికుడి-కాచిగూడ (07792), సికింద్రాబాద్‌-వరంగల్‌ (07462), వరంగల్‌-హైదరాబాద్‌ (07463), సికింద్రాబాద్‌-గుంటూరు (12706), గుంటూరు-సికింద్రాబాద్‌ (12705), సికింద్రాబాద్‌-రేపల్లె (17645)

Read more RELATED
Recommended to you

Exit mobile version