దళితలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త..దళిత బంధుపై కీలక ప్రకటన

-

గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూరు గ్రామ 129 మంది దళిత బంధు లబ్దిదారులకు దళిత బంధు పథకం క్రింద మంజూరు పత్రాలు, యూనిట్ లను పంపిణీ చేశారు తెలంగాణ మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా దళిత బంధుపై హరీష్‌ రావు కీలక ప్రకటన చేశారు. దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సీఎం శ్రీ కేసిఆర్ దళిత బంధు కు శ్రీకారం చుట్టారని…. ఇవ్వాల్టి నుంచి దళిత బంధు యూనిట్ ల ద్వారా లబ్దిదారులు సంపాదించుకునే ప్రతి పైసా వారిదేనని చెప్పారు.

దళిత బంధు ను సద్వినియోగం చేసుకోనీ మేము ఏ ఒక్కరికీ తక్కువ కాదని దళితులు నిరూపించాలేనని… వ్యాపార వృద్ధి సాధించి…అన్ని రంగాలలో ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు దళిత బంధు క్రింద యూనిట్ లు మంజూరు చేస్తామని… ప్రతి పక్ష పార్టీల వారికి దళిత బంధు క్రింద ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు.

ప్రస్తుత బడ్జెట్ లో దళిత బంధు కోసం 17 వేల 800 కోట్లు కేటాయించామని.. 2 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింప జేయనున్నామని ప్రకటన చేశారు. ఒక పథకానికి ఇన్ని వేల డబ్బులు కేటాయించడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారిఅని.. దళితుల కోసం 50 మహిళ రెసిడెన్షియల్ కళాశాల లు తెచ్చిన ఘనత సిఎం కేసిఆర్ దేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news