తెలంగాణ లో యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశం తెల్చకుండా రాష్ట్ర సీఎం కేసీఆర్ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రులు తిట్టిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతులను దూరం చేయాలని కేంద్ర మంత్రులు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహించారు. ఈ వాన కాలంలో తెలంగాణ లో 62 లక్షల ఎకరాల్లో వరి పంట వచ్చిందని అన్నారు. కానీ తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం కేవలం 60 లక్షల టన్నుల వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని కండీషన్ పెట్టారని అన్నారు.
వానా కాలానికి సంబంధించిన మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అందు కోసమే తాము ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. అసలు తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తారో లేదో అనే విషయం తెల్చ కుండా రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర మంత్రులు తిట్టిస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యం విషయం లో బీజేపీ తో పోరాడాల్సిన కాంగ్రెస్ కూడా బీజేపీ తో నాటకాలు ఆడుతుందని అన్నారు.