TS POLYCET 2024 :నేటి నుంచి పాలిసెట్ స్పెషల్ అడ్మిషన్స్

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. పాలీసెట్ డిప్లమోలో చేరాలనుకునే విద్యార్థుల కోసం కీలక అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. వారి అడ్మిషన్లపై… తాజాగా కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పాలిటెక్నిక్ డిప్లమాలో చేరాలనుకునే విద్యార్థులకు… ఇవాల్టి నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు నిర్వహిస్తామని… తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు… అడ్మిషన్స్ కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన. ఇందుకుగాను ఈరోజు నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని దేవసేన స్పష్టం చేశారు.

TS POLYCET 2024 POLYCET Special Admissions from today

ఇక స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత… సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. దీనికోసం ప్రత్యేకమైన డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈనెల 27వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని దేవసేన వివరించారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభమవుతుందని కూడా హామీ ఇచ్చారు. 28వ తేదీన కూడా ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. ఈనెల 31వ తేదీన సీట్లు కేటాయిస్తామని శ్రీ దేవసేన వెల్లడించడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఆగస్టు 2వ తేదీన సంబంధిత కాలేజీలలో… ఎవరైతే ఈ డిగ్రీ చేయాలనుకున్నారా వారు రిపోర్ట్ చేయాలని తెలిపారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు శ్రీ దేవసేన.

Read more RELATED
Recommended to you

Latest news