TSPSC బోర్డును తక్షణమే రద్దు చేయాలి – ఆర్ఎస్ ప్రవీణ్

-

టీఎస్పీఎస్సీ కమిషన్ ను తక్షణమే రద్దుచేసి కొత్త కమిషన్ ను నియమించాలని డిమాండ్ చేశారు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 35 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన బిఎస్పి శాంతియుతంగా గొంతు విప్పితే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. బీఎస్పీ నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం కేసీఆర్ తనకు కావలసిన వ్యక్తులు, బంధువులకు గ్రూప్ వన్ ఉద్యోగాలను అమ్ముకోవడం కోసం టీఎస్పీఎస్సీ ని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు.

ఇప్పుడున్న చేతగాని అవినీతి టీఎస్పీఎస్సీ బోర్డు రద్దయితే తప్ప తెలంగాణలోని నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరగదని అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version