గ్రూప్‌-1పై సుప్రీంలో అప్పీలు ఉపసంహరణకు టీఎస్‌పీఎస్సీ పిటిషన్‌

-

తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. గతేడాది అక్టోబరు 21వ తేదీన దాఖలు చేసిన ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఈ నెల 8న అర్జీ దాఖలు చేసింది. ఇది ఈ నెల 19వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కేసు ఉపసంహరణకు అనుమతి వస్తే రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరగగా.. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్‌ 11 రెండోసారి పరీక్షను నిర్వహించగా అందులోనూ నిర్వహణలోనూ లోపాలున్నాయని, అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదని పలు కారణాలతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీంతో టీఎస్‌పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news