తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్‌పై 50 శాతం రాయితీ ప్రకటించింది ఆర్టీసీ సంస్థ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా TSRTC ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఇవాళ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పల్లె వెలుగు సర్వీసుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ లో 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్ లో ఒకరోజు అపరిమిత ప్రయాణ పాస్ టి-24 టికెట్ ను…ఇవాళ పెద్దలకు కేవలం రూ. 75కు, పిల్లలకు రూ. 50 కే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయని TSRTC పేర్కొంది. కాగా, ఇవాళ సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం ఉండనుంది. ఇవాళ ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ప్రగతిభవన్లో జాతీయ జెండాను ఎగరవేనున్న సీఎం కేసీఆర్… అనంతరం 9 గంటల 50 నిమిషాలకు ప్రగతిభవన్ నుంచి పరేడ్ గ్రౌండ్ కు వెళ్లనున్నారు. అలాగే… ఇవాళ ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తారు తెలంగాణ సీఎం కేసీఆర్.