TTD : తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

-

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిన్న 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. అలాగే… టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 62055 మంది తిరుమల శ్రీవారి భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అటు 27088 మంది భక్తులు నిన్న ఒక్క రోజే తలనీలాలు సమర్పించారు. అటు… నిన్న ఒక్క రోజే… తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్లుగా నమోదు అయింది.

ఇది ఇలా ఉండగా… తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ అర్హతతో తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏఈఈ, ఏఈ, ఏటిఓ పోస్టుల భర్తీకి ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. వయోపరిమితి 42 ఏళ్లు మించరాదు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 23లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనుండగా… వేతనం పోస్టులను బట్టి రూ. 37, 640 నుంచి రూ. 1,47,760 వరకు ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news