నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ఉదయం 10 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఉత్సవాల్లో సీఎం జగన్, రాజ్ భవన్ లో జరిగే వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు.
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను జిఏడి ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు ఆదేశించారు. తెలుగు సాంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇది ఇలా ఉండగా.. వైసీపీ చేపట్టిన ‘సామాజిక సాధికార యాత్ర’ నేడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో గజపతినగరం, మద్యాంధ్రలో నరసాపురం, దక్షిణాంధ్రలో తిరుపతి నియోజకవర్గాల్లో ఇవాళ బస్సు యాత్ర జరగనుంది. ఈ యాత్రకు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు నేతృత్వం వహించనున్నారు. సాయంత్రం మూడు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రసంగిస్తారు.