సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం..సమీకృత హెచ్ఓడీ లకు ట్విన్ టవర్లు

-

సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం పూర్తిస్థాయిలో పని విధానంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయా ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్ఓడీ) కార్యాలయాలను ఒకే చోటకు చేర్చడం గురించి సీఎం చర్చించారు. హెచ్ఓడీ అధికారులకు సెక్రటేరియట్ తో తరచుగా పని వుంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలను కూడా సెక్రటేరియట్ దగ్గర్లో సమీకృతంగా ఒకే చోట నిర్మించేందుకు సీఎం నిర్ణయించారు.

అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్ఓడీలు వాటి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్ కు అందుబాటులో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో సీఎం అడిగి తెలుసుకున్నారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరంమేరకు, హెచ్ఓడీలన్నీ ఒకే చోట వుండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news