సికింద్రాబాద్ గోల్డ్ చోరీ కేసు.. ‘డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌’తో బురిడీ కొట్టించిన దొంగలు

-

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని జ్యూవెల్లరీ షాపులో ఐటీ అధికారుల ముసుగులో చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిందితులను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిపారు.

‘‘ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న ఓ లాడ్జ్‌లో నిందితులు బస చేశారు. ఈనెల 24న రెండు బృందాలుగా ఎనిమిది మంది వచ్చి రెండు వేర్వేరు గదుల్లో బస చేశారు. లాడ్జ్‌ మేనేజర్ కు ఎలాంటి అనుమానం రాకుండా ఒకరికొకరు పరిచయం లేనట్లుగా నిందితులు వ్యవహరించారు. తమ వద్ద ఆధార్‌ జిరాక్స్ లేదని.. వాట్సాప్‌ చేస్తామని చెప్పడంతో మేనేజర్ సరే అన్నాడు. మేనేజర్ తిరుపతికి ఆధార్‌ కార్డులు వాట్సాప్ చేశారు. సరేనని.. అప్పటికప్పుడు వారు చెప్పిన వివరాలు రాసుకున్నాడు.”

“వాట్సాప్ చేసిన ఆధార్ కార్డులు తర్వాత ప్రింట్ తీసుకుందామని అనుకున్నాడు మేనేజర్‌. కానీ చోరీ చేసేందుకు వెళ్లి ముందు రోజు వాట్సాప్ చేసిన ఆధార్ కార్డులను డిలీట్‌ ఫర్ ఎవ్‌రీ వన్‌ కొట్టారు. దీంతో అతనికి వచ్చిన రెండు ఆధార్‌ కార్డులు వాట్సాప్‌ నుంచి మాయమయ్యాయి. 27న ఉదయం 10.30గంటలకు తన (నిందితుల్లో ఒకరు) తల్లి చనిపోయిందని మేనేజర్‌కు చెప్పి హడావుడిగా లాడ్జ్‌ గదిని ఖాళీ చేసి షాపులో చోరీకి బయల్దేరారు.’’ అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news