Telangana: రాష్ట్రానికి మరో రెండు కేంద్ర పురస్కారాలు

-

తెలంగాణ ఇప్పటికే పలు రంగాల్లో పురస్కారాలను అందుకుంది. తాజాగా రాష్ట్రం.. మరో రెండు ప్రతిష్ఠాత్మక కేంద్ర పురస్కారాలకు ఎంపికైంది. దేశంలో వందశాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన సర్వే ఫలితాల్లో రాష్ట్రం ఈ ఘనత సాధించింది. ఈ మేరకు ఓడీఎఫ్‌ ప్లస్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌ అధికారులు రాష్ట్రానికి రెండు పురస్కారాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించినట్లు వారు ప్రకటించారు.

రాష్ట్రానికి రెండు పురస్కారాలు రావడంపై రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. ‘‘మన పల్లె సీమలు మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచాయి. డబుల్‌ ఇంజన్‌తో పని లేకుండానే డబుల్‌ ప్రతిభను ప్రదర్శించాయి.’’ అని అంటూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news