రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ కూలి ఇద్దరు కూలీలు మరణించారు. శిధిలాల కింద మరో 12 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు బీహార్ కు చెందిన బబ్లూ, వెస్ట్ బెంగాల్ కు చెందిన సునీల్ గా గుర్తించారు. పూర్తిస్థాయిలో శిధిలలు తొలగించిన తర్వాత మృతుల సంఖ్య పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఎంతమంది కార్మికులు పనిలోకి వచ్చారు. వారిలో ఎంతమంది సురక్షితంగా ఉన్నారనే సమాచారాన్ని పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.