రేవంత్, కోమటిరెడ్డి కరెంట్ వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది : మంత్రి కేటీఆర్

-

తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ రావడం లేదంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరెంట్ వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని మంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంత్రి కేటీఆర్ యాదాద్రిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి అసలు ఏమి తెలియదని.. ఆయన పబ్బులు, క్లబ్ లు మాత్రమే కావాలని విమర్శలు గుప్పించారు.

24 గంటల కరెంట్ కావాలంటే.. సీఎం కేసీఆర్ ఉండాలన్నారు. ఇప్పటికే 11 సార్లు గెలిచినా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కి మళ్లీ ఒక్క ఛాన్స్ ఇస్తే ఆగం అవుతామని తెలంగాణ పాలన ఢిల్లీ నేతల చేతిలోకి వెళ్తే మనకు ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు సుభిక్షంగా ఉండాలంటే.. మరోసారి కేసీఆర్ ను గెలిపించాలని ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news