తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా రెండు అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీలను (ఉడా) ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ తో పాటు నల్గొండ చట్టు ప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అలాగే ఆ రెండు నగరాభివృద్ధికి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. స్థానిక కలెక్టర్లు, పురపాలక కమిషనర్లను కమిటీలో చేర్చింది.
అలాగే నల్గొండలో నీలిగిరి ఉడా పేరుపైన, అలాగే మహబూబ్ నగర్ లో ఆ జిల్లా పేరు మీదానే అర్బన్ డెవెలంప్ మెంట్ ఆథారిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్ నగర్ ఉడా పరిధిలోకి మొత్తం 12 మండలాల్లోని 142 గ్రామాలను తీసుకువచ్చారు. అలాగే నల్గొండ జిల్లాలోని నీలగిరి ఉడా పరిధిలోకి కూడా పలు గ్రామాలను తీసుకువచ్చారు. అయితే ఉడా ఏర్పాడితే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా ప్రజల కళ సాకరం అయింది.