తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద కొంత మంది గూండాలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మహిళలు అని చూడకుండా సరిత, విజయ రెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ, ఫోన్లు, కెమెరాలు గుంజుకుని, భౌతిక దాడికి గూండాలు పాల్పడినట్లు వీడియోలు చూస్తే అర్థం అవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుండి పాత్రికేయుల మీద వరుస దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల తెలంగాణ చరిత్ర, అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. ఇక గత కొంత కాలంగా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవంత్ అక్రమాలు బయట పెడుతున్నందుకే అక్కసు పెంచుకుని, టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
https://x.com/TeluguScribe/status/1826484482829852953