తన తల నరికి తెస్తే రూ. 10 కోట్లు ఇస్తానని ప్రకటించిన స్వామిజీపై ఉదయనిది స్టాలిన్ మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తానని హెచ్చరించారు స్వామీజీ పరమహంస ఆచార్య. అయితే..ఈ అంశంపై ఉదయనిధి తన స్టైల్ లో స్పందించారు. ‘నా తల కోసం ఎవరు వస్తారో చూస్తా. గతంలోనూ కరుణానిధిపై రూ. కోటి ప్రకటించారు. నేను ఎవరికి భయపడను. స్వామీజీలకు కోట్ల డబ్బు ఎలా వచ్చింది’ అని ఉదయనిధి ప్రశ్నించారు.

Udhayanidhi Stalin comments viral
ఇది ఇలా ఉండగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ సోమవారం తీవ్రంగా ఖండించింది, ప్రతిపక్షాల I.N.D.I.A. కూటమికి ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.“తమిళనాడు ప్రజలను, సీఎం ఎంకె స్టాలిన్‌ను తాను చాలా గౌరవిస్తానని మమతా బెనర్జీ తెలిపింది. ప్రతి మతానికి భిన్నమైన భావాలు ఉంటాయన్నారు. భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని ఒక వర్గానికి హాని కలిగించే ఏ విషయంలోనూ తాము జోక్యం చేసుకోమన్నారు.