వామ్మో.. ధనుష్ లో ఈ టాలెంట్ కూడా ఉందా.?

-

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ తెలుగు, తమిళ్ అంటూ తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ విజయాన్ని అందుకుంటున్న హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని.. తనను తాను మరింతగా మార్చుకొని.. ఒకప్పుడు తనను అవమానించిన వారే నేడు అభిమానులుగా మారిపోయేలా చేసుకున్నారు ధనుష్. ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ఫుల్గా కొనసాగుతూ మరింత బిజీగా మారిపోయారు.

మరొకవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్ ఐశ్వర్య రజనీకాంత్ ని వివాహం చేసుకొని రజినీకాంత్ కి అల్లుడు అయిన ఈయనకు మరింత క్రేజ్ లభించిందని చెప్పాలి . ఇకపోతే వివాహం జరిగి ఇద్దరు కొడుకులు జన్మించిన తర్వాత 18 సంవత్సరాలు వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపి.. ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే ధనుష్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ధనుష్ లో ఉన్న మరో కోణం గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు

ధనుష్ యాక్టర్ గానే కాదు సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన అద్భుతంగా పాటలు పాడడమే కాదు పాటల రచయిత కూడా అనే విషయం చాలామందికి తెలియదు . ఎన్నో అద్భుతమైన పాటలను మనకు అందించారు. ఆయన పాడిన వైదీస్ కొలవరి పాట ఆయనే స్వయంగా రాశారు. మరొకవైపు సాయి పల్లవి, ధనుష్ హీరో హీరోయిన్లుగా నటించిన రౌడీ బేబీ సినిమాలోని పాటలన్నీ కూడా ధనుష్ స్వయంగా రాయడం గమనార్హం. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news