‘హనుమాన్’ సినిమా హీరోను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

‘హనుమాన్’ సినిమా హీరో తేజ సజ్జ ను అభినందించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారిని హనుమాన్ హీరో తేజ సజ్జ కలిశారు. న్యూఢిల్లీలోని ఈ సందర్భంగా ఆయన నివాసంలో కలిసిన తేజ సజ్జను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు అభినందించారు.

Union Minister Kishan Reddy congratulated Hanuman movie hero Teja Sajja

దేశ వ్యాప్తంగా సన్సెషన్ సృష్టించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ సందర్బంగా భవ్య రామ మందిరానికి ప్రతి టిక్కెట్టు నుండి 5.రూ విరాళంగా ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు.

కాగా, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన సినిమా హనుమాన్. ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ఊచకోత కోస్తోంది. ఈ ఏడాదిలో రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు సినిమాగా హనుమాన్ ఘనత సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news