తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియా తో మాట్లాడారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం పై సీబీఐ విచారణకు తాము డిమాండ్ చేశామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కోరామని చెప్పుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అతలకుతలమైంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పెద్ద తేడా ఏమి లేదన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.