ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ పాత్ర ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో సీఎల్పీ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేయించినా నా గెలుపును మాత్రం ఆపలేకపోయారని తెలిపారు. కేటీఆర్ దొంగ చాటునంగా ఫోన్లు విన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ బుద్ది మార్చుకోవాలి. కేటీఆర్ దుర్మార్గాలను ఒక్కొక్కటి బయట పెడతామన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది.. విన్నది కేటీఆరే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు నన్ను గన్ తో బెదిరించారని తెలిపారు.
బతుకుమీద ఆశ లేదా..? అని తనను కేటీఆర్ బెదిరింపులకు గురి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వికారాబాద్ లగచర్ల ఘటనలో కూడా కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. సురేష్ కాల్ రికార్డింగ్ లో కేటీఆర్ బండారం బయటపడిందని తెలిపారు. కేటీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నరికేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు.