బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్విరాన్ మెంట్ పై తీసిన షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూన వెంకట్ మా పార్టీ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉంది. అనేక సామాజిక సినిమాలు తీసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి వెంకట్.షార్ట్ ఫిలిం చాలా సందేశాత్మకంగా ఉంది. చాలా అద్భుతంగా షార్ట్ ఫిలిం రూపొందించారు. సామాజిక స్పృహతో చాలా చక్కగా షార్ట్ ఫిలిం తీసిన స్ఫూర్తికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.
కాలుష్యం మానవాళికి ప్రమాధకరంగా మారింది. యువతలో సామాజిక స్పృహ పెరగాలి. ప్రతి వ్యక్తికి సామాజిక భాధ్యత తప్పనిసరి. పదేళ్ల క్రితం గాంధీ జయంతి రోజునే మోడీ స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. థర్మల్ పవర్ ఉత్పత్తి నీ నిషేధించే పనిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. థర్మల్ పవర్ రానున్న రోజుల్లో మన దేశానికి చాలెంజ్ గా ఉంటుంది. 85 శాతం బొగ్గు ఆధారిత విద్యుత్ దేశంలో ఉంది. రానున్న రోజుల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వైపు షిఫ్ట్ కావాలని మోడీ చెప్పారు. విచ్చలవిడిగా విద్యుత్ ఉపయోగం జరుగుతోంది. ఎన్విరాన్ మెంట్ లాస్, ఎనర్జీ లాస్, గ్రీనరీ లాస్, వాటర్ లాస్ జరుగుతోంది. ఎన్విరాన్ మెంట్ లో భాగంగా ప్రధాని మోడీ తల్లి పేరు మీద ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి కాపాడటం ప్రతి ఒక్కరి భాద్యతగా తీసుకోవాలి అని కిషన్ రెడ్డి అన్నారు.