ఇచ్చిన మాటను నెరవేర్చిన ఏపీ ముఖ్యమంత్రి..!

-

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. మీ కష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉండడానికే పేదల సేవలో అనే కార్యక్రమం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి మంగళవారం పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహించిన పేదలకు సేవలో కార్యక్రమంలో ప్రజలతో చెప్పారు..పింఛన్ల పంపిణీ లో భాగంగా మంగళవారం పుచ్చకాయలమడ గ్రామంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు.. తలారి గంగమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంగా తన చిన్న కుమారుడు అశోక్ పదో తరగతి చదివి అద్దె ఆటో నడుపుతున్నాడని, ఎలక్ట్రికల్ ఆటో కావాలని గంగమ్మ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు..ముఖ్యమంత్రి స్పందించి రేపే ఎలక్ట్రికల్ ఆటో అందచేయాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ను ఆదేశించారు.

అదే గ్రామానికి చెందిన కవిత తన భర్త రాముడుకి కర్నూలు నగరంలోని అమీలియో ఆసుపత్రిలో నరాల వ్యాధికి సంబంధించి ఆపరేషన్ చేస్తున్నారని ఆర్థికంగా సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కోరారు.. వెంటనే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కవిత భర్త వైద్య సేవల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ . బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు బుధవారం కలెక్టరేట్ లో అశోక్ కుమార్ కు రూ.3.8 లక్షల విలువ కలిగిన ఎలక్ట్రికల్ ఆటోను, కవితకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news