కాంగ్రెస్ ప్రభుత్వం BRS ను ఫాలో అవుతుంది : కిషన్ రెడ్డి

-

సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి హాజరైన కేంద్రమంత్రికిషన్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తాము. 2014 లో బీజేపీ సభ్యత్వ సేకరణ తర్వాత 2024 లో చేస్తున్నాము అని తెలిపారు. నూతనంగా గ్రామీణ మండల జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీ సేకరణ ఏర్పాటు చేస్తాం. నవంబర్ 1 నుండి బీజేపీ ఉద్యమ బాట పట్టనుంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల పాలనలో గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించాయి.

కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం వెనుకబడింది. రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ సరిగా పథకాలు అమలు కాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా BRS తరహాలోనే వ్యవహరిస్తుంది. పేదలకు ఇల్లు కట్టకుండా పేదల ఇళ్లను కూలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే. అతి తక్కువ సమయంలో ప్రజల వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి సుందరీకరణ పేరుతో లక్ష 80 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించి ఇంతవరకు DPR తయారు చేయలేదు అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news