కేరళ పేలుళ్లపై కేంద్ర మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. కేసు నమోదు

-

ప్రశాంతంగా ఉండే కేరళలో ఆదివారం చోటు చేసుకున్న పేలుళ్లు ఉలిక్కి పాటుకు గురి చేసాయి. ఈ ఘటనను ఉద్దేశించి కేంద్రమంత్రి రాజీవ్ చందశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది. వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చ గొట్టేలా ప్రకటనలు చేశారంటూ ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా ఏజెన్సీ వెల్లడించింది.

ఈ పేలుళ్లపై రాజీవ్ చంద్రశేఖర్ కేరళ సీఎం పినరయి విజయన్ పై విమర్శలు గుప్పించారు. కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడుతున్నాయని.. అయినప్పటికీ కేరళ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యల్లో మతపరమైన అజెండా కనిపిస్తోందని మండిపడ్డారు. ఓ బాధ్యతయుతమైన మంత్రిగా ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న సంస్థలపై కొంచెం అయినా గౌరవం ఉంచాలి. దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది. కానీ వారు మాత్రం కొన్ని వర్గాలే లక్ష్యంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news