వరల్డ్ కప్ లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఆడుతున్న తీరు చాలా విమర్శలను తీసుకువచ్చింది అని చెప్పాలి. ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఆడిన ఆరు మ్యాచ్ లలో అయిదు ఓడిపోయి ఇప్పటికే సెమీస్ అవకాశాలను పోగొట్టుకుంది. తాజాగా ఇంగ్లాండ్ టీం పై ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ ఇంగ్లాండ్ ప్రదర్శనతో ప్రేక్షకులు చాలా నిరాశకు గురయ్యారన్నారు. చిన్న జట్లపై కూడా ఓటమి పాలవ్వడం చాలా బాధాకరం అని రవిశాస్త్రి జాలి చూపించాడు. ఇలాంటి ప్రదర్శన చేస్తున్న ఇంగ్లాండ్ ను ఎవరైనా ఛాంపియన్ అంటే నమ్మగలమా ? ప్రస్తుతం ఇంగ్లాండ్ హాట్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది అంటూ రవిశాస్త్రి బాధపడ్డాడు.
ఈ వరల్డ్ కప్ ముగిసే లోపు ఇంగ్లాండ్ కనుక ఆఖరి రెండు స్థానాలలో ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ కి దూరం అవుతుంది.. అలా జరిగితే ఇక ఇంగ్లాండ్ పరువు పోవడమే. అందుకే ఇకపై ఇంగ్లాండ్ ఆడే ప్రతి మ్యాచ్ తన పరువుకు సంబంధించినదే..