బీఆర్ఎస్ గెలిస్తే.. కృష్ణానదికి గోదావరి నీళ్లు : సీఎం కేసీఆర్

-

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వ్యక్తి చరిత్ర ఏందో తెలుసుకోవాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ 50 ఏళ్లు పరిపాలించింది. కానీ కాంగ్రెస్ సరిగ్గా పాలిస్తే కష్టాలు ఎందుకు ఉండేవి. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజాశక్తి గెలవాలి. ఈ బాధ శాశ్వతంగా పరిస్కరించే బాధ్యత నాది. ఉదయ సముద్రం నుంచి పెద్దదేవుళపల్లి చెరువులోకి నీళ్లు తీసుకొస్తాం. బీఆర్ఎస్ గెలిస్తే.. సాగర్ కి గోదావరి నీళ్లు తీసుకొస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతలు రకరకాలుగా మాట్లాడుతారు. వారి మాటలు నమ్మకండి. ఇన్నేళ్లు చేయనిది.. ఇప్పుడు ఏం చేస్తారని పేర్కొన్నారు. యుగయుగాలకు తరతరాలుగా దళిత జాతి అణచివేతకు గురవుతోంది. దళిత బంధు అనే స్కీమ్ పుట్టించింది కేసీఆర్ అని చెప్పారు. మిర్యాలగూడ అభ్యర్థి భాస్కర్ రావుకు ఏదైనా న్యాయం చేయడం అలవాటు అని సీఎం కేసీఆర్ తెలిపారు. భాస్కర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news