సాక్ష్యాలను కమిషన్ ముందు ఉంచుతా..!

-

మాజీ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నేను కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యాను అని వి ప్రకాష్ పేర్కొన్నారు. నా అభిప్రాయాలను కమిషన్ ముందు ఉంచాను. తెలంగాణ భవిష్యత్ కోసం అన్ని ప్రాజెక్టులను కేసీఆర్ రీ-డిజైన్ చేశారు.. తుమ్మిడిహేట్టి బ్యారేజ్ కట్టాలని KCR మదిలో ఉండేది కానీ మహారాష్ట్ర దానికి ఒప్పుకోలేదు. స్టోరేజ్ లేకపోవడం వల్ల తుమ్మిడిహేట్టి నిర్మాణం ఆలోచన ముందుకు వెళ్ళలేదు. సిడబ్ల్యూసీ చెప్పినట్లు… 164 TMCలలో 64 TMCలు తెలంగాణవి కాదు అని ఆ రిపోర్టులో నే ఉంది.

వార్డానది బ్యారేజి 2500 కోట్లతో నిర్మాణం అవుతుంది…తుమ్మిడిహేట్టి 7500 ఖర్చు అవుతుంది. V షెప్ లో బ్యారేజి కట్టడం సాధ్యం కాదు అందుకే కట్టలేదు. తుమ్మిడిహేట్టి వద్ద 54 TMC నీళ్ళ లభ్యతనే ఉంటుంది అని ఆధారాలు చూపించాను. కృష్ణ, గోదావరి బేసిన్ లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎలాంటి అవినీతి జరగలేదు అని నోట్ రూమ్ లో కమిషన్ కు ఇచ్చాను. నేను కమిషన్ ముందు చెప్పిన వాటిని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని అన్నారు. మళ్ళీ 26న కమిషన్ కు ఆధారాలు ఇస్తాను అని వి ప్రకాష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news