రైతు రుణ మాఫీపై BRS అలాగే కాంగ్రెస్ నాయకుల మధ్య మాటకు మాట నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రుణ మాఫీపై BRS లీడర్ హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ లో హరీష్ రావు మాట్లాడుతూ.. మొదట 31 వేల కోట్లు అని.. ఇప్పుడు 18 వేల కోట్లతో రుణ మాఫీ ఎలా చేసారు అని ప్రశ్నించారు. 47 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేస్తా అని.. ఇప్పుడు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణ మాఫీ చేసారు.
కానీ ఇప్పుడు సీఎం అందరికి రుణ మాఫీ జరిగింది అని అంటున్నారు. కాబట్టి ఎప్పుడు, ఎక్కడికి వెల్దంహమో నువ్వే చెప్పు రేవంత్ రెడ్డి.. నీ నియోజక వర్గం అయినా ఓకే.. నా నియోజక వర్గం అయినా ఓకే.. నువ్వు తీసుకెళ్లిన దగ్గర రైతులకు అందరికి ఆగస్ట్ 15 వరకు సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందా లేదా అని వెళ్లి అడుగుదాం అని పేర్కొన్నారు హరీష్ రావు.