రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెలిమెడ లక్ష్మీనరసింహారావు ను, పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. దీంతో వేములవాడ నియోజకవర్గంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావు అభిమానుల్లో సంతోషం నెలకొంది.
సంకె పల్లి లో సంబరాల్లో మునిగిపోయారు బీఆర్ఎస్ నేతలు. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరిని కలుపుకుపోతానని.. మూడవసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు రావాలని.. కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని చెలిమెడ లక్ష్మి నరసింహరావు తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకి టికెట్ దక్కలేదు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు ఉత్తమమైన వ్యక్తి అని.. అయినా పౌరసత్వం కేసు న్యాస్థానాల్లో పెండింగ్ ఉన్నందువల్లనే మార్పు చేశారు. పార్టీకి ఇష్టం లేకున్నా అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.