త్వరలోనే వైబ్రంట్‌ తెలంగాణ 2050 మెగా మాస్టర్‌ ప్లాన్‌

-

 

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్‌ తెలంగాణ 2050 మెగా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకటించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ బైరామల్‌గూడ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన రెండో ఫ్లైఓవర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, వైబ్రంట్‌ తెలంగాణపై కీలక అంశాలను ప్రస్తావించారు.

cm revanth

ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, పంచాయతీలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చి అర్బన్‌ తెలంగాణగా, 354 కి.మీ మేరకు ఓఆర్‌ఆర్‌ నుంచి ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, అక్కడి నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతం వరకు రూరల్‌ తెలంగాణగా రాష్ట్రాన్ని మొత్తం మూడు విభాగాలుగా సమగ్రాభివృద్ధి ప్రణాళికలు రూపొందించబోతున్నట్టు చెప్పారు.వైబ్రంట్‌ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్‌ కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ ప్రణాళిక వచ్చిన తర్వాత ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news