HMDA కార్యాలయంలో ముగిసిన విజిలెన్స్ దాడులు

-

హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది.. దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో సోదాలు చేసింది. గత ప్రభుత్వంలో అనుమతిచ్చిన ఫైల్స్ కావాలని విజిలెన్స్ అధికారులు కోరారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్ పలు వెంచర్లకు అనుమతించిన ఫైల్స్ పరిశీలించారు. హెచ్ఎండీఏ డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు జరిగినట్లు సమాచారం. కాగా.. ఉదయం 7 గంటల నుండి మైత్రివనంలోని 4వ అంతస్తు హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది. ఈ క్రమంలో.. అన్ని ఫైళ్లను అధికారులు సీజ్ చేశారు.

సోదాలు చేపట్టిన విజిలెన్స్ నిఘా టీం అరెస్ట్ వారెంట్ తో వెళ్లింది. హెచ్ఎండీఏ ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్ గతంలో అనుమతించిన ఫైల్స్ పై ఆరా తీశారు. ఇదిలా ఉంటే.. రేపు జీహెచ్ఎంసీ, ఎల్లుండి డిస్ట్రిక్ టౌన్ ప్లానింగ్ డీటీపీసీ కార్యాలయాల్లో విజిలెన్స్ దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి రాబోయే 15 రోజుల్లో విజిలెన్స్ సోదాలు జరుపుతుందని చెప్పారు. ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే.. విజిలెన్స్ సోదాలు చేపట్టింది.

HMDA కార్యాలయంలో  విజిలెన్స్ సోదాలు తాజాగా ముగిశాయి.  కీలకమైన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫైల్స్ ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను ఇవ్వనున్నారు. ప్రధానంగా శివబాలకృష్ణ చేసిన అవినీతికి సంబంధించిన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news