తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ సోదాలు

-

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ సోదాలు కలకలం రేపుతున్నాయి. యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అకౌంట్ సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని చర్యలకు దిగింది ఈసీ. వీసీ అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్ ను మారుస్తున్నామని ఈసీ, కొత్త రిజిస్ట్రార్ ను నియమిస్తూ వీసీ నిర్ణయం.. పాలన గందరగోళంగా మారింది. ఈసీ సభ్యులకు, వీసీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news