చాంద్రాయణగుట్ట మిస్సింగ్ మర్డర్ కేసును చేదించిన పోలీసులు

ఇటీవల చెరువులో ఓ డ్రమ్ములో డెడ్ బాడీ దొరికిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చంద్రాయన గుట్ట పోలీసులు ఈ మర్డర్ కేసు మిస్టరీని ఛేదించారు. ప్రేమ కోసం ప్రియుడిని కిడ్నాప్ చేసి, మరో ప్రియుడితో కలిసి ప్రియురాలు హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “చాంద్రాయణగుట్టలో గత నెల 22వ తేదీన జరిగిన మిస్సింగ్ మర్డర్ కేసును ఛేదించడం జరిగింది. గత నెల 22 వ తేదీన కనిపించకుండా పోయి దారుణ‌ హత్యకు గురయ్యాడు పురాన్ సింగ్. పురాన్‌సింగ్ హత్య వెనుక జయదేవి అనే మహిళ హస్తం ఉన్నట్లు గుర్తించాం. మూడు నెలల క్రితం పురాన్ సింగ్ పై హత్యాయత్నం జరిగింది. పురాన్ సింగ్, జయ దేవి ఉత్తరప్రదేశ్ కి చెందినవారు. వారు బండ్లగూడలోని పటేల్ నగర్ లో నివాసం ఉంటున్నారు.

పురాన్ సింగ్ ను జయదేవి హత్య చేయించినట్లుగా గుర్తించాం. గతంలో జయదేవితో ప్రేమ వ్యవహారం నడపిన పురాన్‌సింగ్.. జయదేవిని కాదని మరో యువతిని హైదరాబాద్ కు వచ్చి పెళ్ళి చేసుకున్నాడు. తనను పెళ్ళి చేసుకోలేదన్న కోపంతో పురాన్ సింగ్ పై కక్ష్య తీర్చుకునేందుకు నగరానికి వచ్చింది జయదేవి. నగరంలో రాజస్తాన్ కు చెందిన నజీమ్ ను ప్రేమించి అతని సహాయంతో పురాన్ సింగ్ ను హత్య చేయించింది జయదేవి”. దీంతో నజీమ్, సూగుణారామ్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జయదేవి తో పాటు మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడు.