మొటిమలు, మచ్చలు ఎక్కువగా ఉన్నాయా..? అయితే ఈ ఇంటి చిట్కాలు మీకోసం..!

-

చాలామంది రకరకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి ముఖం మీద కానీ చర్మంపై కానీ ఏమైనా మచ్చలు మొటిమలు వంటివి వచ్చాయంటే అందం పాడవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఇటువంటివి అందాన్ని తగ్గిస్తూ ఉంటాయి. చాలామంది మొటిమలు మచ్చలు వచ్చాయి అంటే క్రీములని వాడడం లేజర్ ట్రీట్మెంట్లను చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చలు లేదంటే ఇంకేమైనా చర్మంపై ఇబ్బందిని కలిగిస్తుంటే ఈ విధంగా మీరు పోగొట్టుకోవచ్చు. క్లియర్ స్కిన్ ని పొందొచ్చు. మరి అది అలా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కీర, బార్లీ తో మీ అందాన్ని పెంచుతాయి. నల్లటి మచ్చల్ని తొలగిస్తాయి. ఒక టీ స్పూన్ కీరా దోస పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ బార్లీ, పిండిని వేయండి. దీనిని పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నుండి 20 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే నల్లటి మచ్చలు పోతాయి ఓట్స్ బార్లీ పౌడర్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు తొలగించడానికి ఓట్స్ పౌడర్ బార్లీ పౌడర్ ముఖానికి అప్లై చేసుకోవడం మంచిది ఈ రెండిటిని ముందు పేస్ట్ లాగ చేసుకుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

మొటిమలు నల్లని మచ్చలు ఏర్పడినట్లయితే బాదం పప్పులని కొన్ని పాలల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్ట్ లాగా చేసి కొంచెం సెనగపిండి కొంచెం నిమ్మరసం వేసి పేస్ట్ లాగ చేసుకుని ముఖానికి పట్టిస్తే సరిపోతుంది. ఆరిన తర్వాత కడిగేసుకోండి. బంగాళదుంపల్ని మెత్తని పేస్ట్ చేసి రసం తీసుకోవాలి. ఈ రసం లో కొంచెం, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలా వదిలేసి ఆరాక ముఖం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో మీ అందాన్ని మరింత పెంచుకోవచ్చు. మొటిమలు, మచ్చలు వంటివి లేకుండా అందంగా కనపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news