మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

-

మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఈరోజు (మే 27వ తేదీ) ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. హైదరాబాద్ నుంచి సీతాదేవి పార్థివదేహాన్ని ఇవాళ సాయంత్రం ఏపీలోని కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలంలో ఆమె స్వగ్రామం కోడూరుకు తీసుకువెళ్తారు. అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.

సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి టీడీపీ తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. చంద్రబాబు సీతాదేవి మరణంపై స్పందిస్తూ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీతాదేవి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news